ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేస్తూ సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ భారీ స్థాయిలో 30 వేల ఉద్యోగాల కోత విధించిన సంగతి తెలిసిందే. లేఆఫ్స్ జరిగిన 48 గంటలు గడవకముందే కంపెనీ మిగిలిన లక్షా 60 వేల మంది ఉద్యోగులకు మరో మెయిల్ పంపింది. ఆ మెయిల్లో కంపెనీ భవిష్యత్ వ్యూహాలు, ఖర్చుల నియంత్రణ చర్యల కారణంగా మరిన్ని ఉద్యోగాలపై ప్రభావం ఉండవచ్చని హెచ్చరించింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది.

