బడంగ్‌పేట మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనం కావడానికి ముందు.. గత రెండేళ్ల కాలంలో సుమారు రూ.122 కోట్ల నిధులు అడ్డగోలుగా పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కీలకమైన రికార్డులను మాయం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. విజిలెన్స్ విచారణలో వెల్లడైన ఆధారాల ప్రకారం.. డిప్యూటీ కమిషనర్ పి. సరస్వతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి. రఘు, ఎ. యాదయ్య, జ్యోతి, సహా మొత్తం 10 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.

