తిరుపతి జిల్లా బాలాయపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తుండగా ఇంజిన్ భాగం నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

