గురువారం ఉదయం 11:30 గంటలకు గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రధాన యాత్ర రాత్రి 8 గంటలకు తాడిబండ్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. ఈ ప్రధాన ర్యాలీలో మరో 14 ఉపయాత్రలు కలవనున్నాయి. యాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా సిటిఒ తాడిబండ్, ఇసిఐఎల్, ఎఎస్ రావు నగర్, సైనిక్‌పురి, తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది.

