తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో వివిధ రకాల ధృవీకరణ పత్రాలు, బిల్లు చెల్లింపుల కోసం వసూలు చేసే యూజర్ ఛార్జీలను భారీగా పెంచింది. తక్షణమే లభించే ఏ-కేటగిరీ సర్టిఫికెట్ ప్రింట్ వంటి సేవలకు రూ. 62 వసూలు చేయనుండగా.. ఇన్కం, క్యాస్ట్, నివాస ధృవీకరణ పత్రాల వంటి బి-కేటగిరీ సేవలకు రూ. 80గా ధరను నిర్ణయించారు. స్థానికత ధ్రువీకరణ పత్రం గతంలో రూ.45 నుంచి రూ.55 ఉండగా.. ప్రస్తుతం రూ.80కి పెంచారు

