రాజధాని పేరుతో దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నారా?. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి?. 2019 వరకు హైదరాబాద్ కు షటిల్ సర్వీస్ చేశారు. పవన్, లోకేష్లకు కూడా ప్రత్యేక విమానాల్లో షటిల్ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు. మేము అప్పుడు, ఇప్పుడు ఇదే చెబుతున్నాం. కానీ, ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తున్నాడు.

