పశ్చిమబెంగాల్లోని బాగ్డోగ్రా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంగళవారం సాయంత్రం సాంకేతిక కారణాలతో లఖ్‌నవూ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం గాలిలో ఉండగానే పొగలు రావడంతో పైలట్ ‘మేడే కాల్’ సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే లఖ్‌నవూలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 148 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

