బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలో మాఘ్రా గ్రామంలో చైత్రమాసం చివరి వారం కావడంతో శీతలా మాతా ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఒక్కసారిగా తోపులాట జరగడంతో ఎనిమిది భక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ప్రతి మంగళవారం ఇక్కడ రద్దీ ఉంటుందని, తాము దర్శనం కోసం వచ్చామని పాట్నా నుంచి వచ్చిన ఓ భక్తురాలు తెలిపింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగిందని వివరించింది. పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

