‘సోషల్ మీడియా రీల్స్’ వ్యామోహం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తిరుపతిలో సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ ధను బహదూర్ దంపతుల 13 ఏళ్ల కూతురు పుష్ప రీల్స్ వీడియోలు తీస్తూ ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. బయటకు వెళ్లిన కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. తల్లి పుష్పను తల్లి వెతుకుతుండగా అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తుకు వెళ్లారు. అయితే ఆమె ప్రమాదవశాత్తు ఐదవ అంతస్తుపై నుంచి పడినట్లు గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

