రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహక అధికారులు (సీఈవో)గా పదోన్నతులు కల్పించింది. అలాగే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని అధికారులకు పదోన్నతులతోపాటు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బి. ఆర్జున్ రావుకు సీఈవోగా పదోన్నతి కల్పిస్తూ.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగాలని ఆదేశించింది. అలాగే పి. ఉర్మిళా దేవికి సైతం పదోన్నతి కల్పిస్తూ.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగాలని ఉత్తర్వులు
జారీ చేసింది.

