ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి హైఫా నగరంలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం (బజాన్ రిఫైనరీ)పై ఇరాన్ క్షిపణులతో భారీ దాడికి తెగబడింది. ఈ దాడి కారణంగా రిఫైనరీలో భారీ ఎత్తున మంటలు చెలరేగగా, ఆకాశమంతా నల్లటి పొగ కమ్ముకుంది. బజాన్ రిఫైనరీ లక్ష్యంగా దాడి జరగడం ఇది రెండోసారి కావడంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలపై చర్చ మొదలైంది. ఈ దాడి వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటమే కాకుండా, ఇజ్రాయెల్ ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

