ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేట పర్యటనలో భాగంగా పేదల కోసం నిర్మించిన టిడ్కో (TIDCO) ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సామూహిక గృహ ప్రవేశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్లను స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి, వారి సంతోషాన్ని పంచుకున్నారు.ఒక సురక్షితమైన కాలనీని అభివృద్ధి చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గృహ సముదాయాలు పేదలకు ఆత్మగౌరవాన్ని కలిగిస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

