తిరుమల శ్రీవారి భక్తులకు కొండపై అన్నప్రసాదం అతి ముఖ్యమైనది. అయితే, గత పది రోజులుగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు ఇతర వితరణ కేంద్రాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా తిరుమలలోని ప్రైవేట్ హోటళ్లు, దాదాపు 40కి పైగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. దీంతో భక్తులకు టీటీడీ అన్నప్రసాద కేంద్రాలే ఏకైక దిక్కయ్యాయి. పది రోజుల్లోనే దాదాపు లక్షన్నర మంది అదనంగా అన్నప్రసాదం తీసుకున్నారు.

