ఆస్ట్రేలియాలో అరుదైన ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమైంది. కాకపోతే, ఇది చాలామందిని భయపెట్టింది కూడా. ఈ ఘటన శుక్రవారం ఆస్ట్రేలియాలోని డెన్హామ్ అనే టూరిస్ట్ పట్టణంతోపాటు షార్క్ బే, పిల్బారా ప్రాంతాల్లో జరిగింది. ఆకాశం పూర్తిగా రక్తపు ఎరుగు రంగులోకి మారిపోవడంతో ప్రతి దృశ్యం ఎర్రగానే కనిపించింది. నారెల్లె అనే ఉష్ణమండల సైక్లోన్ ప్రభావంతో ఇలా జరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. కాంతి వికిరణ చర్య ద్వారా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

