అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్ష విధానాలపై అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో గతంలో ఎన్నడులేని విధంగా భారీగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ‘నో కింగ్స్’ అంటూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మొత్తం 50 రాష్ట్రాల్లో 3,100 నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనల్లో సుమారు 90 లక్షల వరకు ప్రజలు పాల్గొన్నారు, అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద నిరసన అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

