మదనపల్లెలోని జెడ్పీ హైస్కూలులో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని పరీక్షా హాలులో పాము అఫ్రన్ కాలు మీద కాటువేసింది. అయితే పాము కాటు వేసిన విషయాన్ని సదరు విద్యార్థిని ఇన్విజిలేటర్‌కు చెప్తే.. ఇన్విజిలేటర్ ఏమీకాదని..భయపడకుండా పరీక్ష రాయాలని సూచించినట్లు అఫ్రన్ చెబుతోంది. తరగతి గదిలోకి ప్రవేశించింన పామును చూసిన విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. మరోవైపు తమ పాపకు పాము కరిస్తే స్కూలు యాజమాన్యం, ఇన్విజిలేటర్ కనీసం సమాచారం ఇవ్వలేదని విద్యార్థిని తల్లి ఆరోపిస్తున్నారు.

