పలువురు మహిళలపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్కుడు అశోక్ ఖరత్‌తో సంబంధంపై విమర్శల నేపథ్యంలో ప్రభుత్వ, పార్టీ పదవులకు రూపాలీ చకాన్కర్ రాజీనామా చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్ర మహిళా విభాగం అధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా సమర్పించారు. శోక్ ఖరత్, ఆయన ఆలయ ట్రస్ట్‌తో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మార్చి 20న మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్ష పదవి నుంచి రూపాలీ తప్పుకున్నారు.

