కర్ణాటకలోని హాసన్ జిల్లా సకలేష్పురలో గల చారిత్రాత్మక బెట్టద భైరవేశ్వర ఆలయ ప్రాంగణంలో ప్రీవెడ్డింగ్ షూట్ కోసం వచ్చిన ఒక బృందంపై స్థానిక యువకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. షూటింగ్ సమయంలో ఫొటోగ్రాఫర్లు బూట్లు ధరించి ఆలయ ప్రాంగణంలోకి వెళ్లడం,ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని స్థానిక యువకులు ఫొటోగ్రాఫర్లను చితకబాదారు. సుమారు 5 లక్షల రూపాయల విలువైన ఖరీదైన కెమెరాను, ఇతర షూటింగ్ పరికరాలను ధ్వంసం చేశారు.

