మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన సంకల్పంలో ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. “ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తాం. ఎవరైనా అడ్డుపడితే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుంది. మూసీ ఒడ్డున మసీదు, చర్చి, గురుద్వారా కూడా నిర్మిస్తాం. ఇది గొప్ప పర్యాటక కేంద్రంగా మారబోతోంది. మూసీ నదిలో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తాం” అని సీఎం అన్నారు.

