ప్రపంచ ప్రఖ్యాత గోల్ఫ్ దిగ్గజం Tiger Woods మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అతివేగంతో కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారన్న ఆరోపణలతో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాల ప్రభావంతో వాహనం నడిపారన్న అనుమానంతో ‘డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్’ (DUI) కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వుడ్స్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసు అధికారులు వెల్లడించారు.

