లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హిమపాతం సంభవించడంతో ఏడుగురు మరణించారు. జోజిలా పాస్‌లోని జీరో పాయింట్ వద్ద ఈ ఘటన జరిగింది. మరికొందరు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ మంచు కింద ఐదు వాహనాలు కూరుకుపోవడంతో రిస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు.అకస్మాత్తుగా, తీవ్రంగా సంభవించిన ఈ హిమపాతం అనేక వాహనాలను కబళించింది.

