బెజవాడ ఉగ్ర లింకుల కేసులో పోలీసులు పాట్నాకు చెందిన షాద్‌మాన్ దిల్‌కష్ ను అరెస్ట్ చేశారు. మెడిసిన్‌లో సీటు కోసం నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న దిల్‌కష్ తీవ్రవాద, జిహాదీ భావజాలానికి ఆకర్షితుడై చివరకు కటాకటాలపాలయ్యాడు. బెనెక్స్ గ్రూప్‌లో సభ్యుడిగా ఉంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘షాద్‌మాన్ రైట్స్’ఐడీతో పాటు మరికొన్ని ఎకౌంట్ల ద్వారా తీవ్రవాద భావజాలాన్ని పోస్టు చేయడంతో పాటు షేర్ చేసేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోని బెనెక్స్ గ్రూప్‌లో సభ్యుడిగా ఉంటూ దేశవ్యాప్తంగా ఉన్న సభ్యులతో సంబంధాలు నెరిపేవాడు.

