ఇరాన్‌పై అమెరికా చర్యలకు నాటో మద్దతు ప్రకటించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ, ఇరాన్‌పై అమెరికా తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలు ఐరోపా భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ నాటో తమకు మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యల తర్వాతే మార్క్ రుట్టే స్పందిస్తూ నాటో వైఖరిని స్పష్టం చేశారు

