ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రాయపూడి సమీపంలో ఉన్న ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద సంభవించిన భారీ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు కారణమైనట్లు భావిస్తున్న అనుమానితుడు,
వాచ్మెన్ రామ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనకు గల కారణాలపై పోలీసులు అతడిని విచారిస్తున్నారు. సాంకేతిక ఆధారాల సేకరించి ఈ చర్యలు తీసుకున్నారు.

