ఇండియా సహా తమ మిత్రులైన ఐదు దేశాల నౌకల కోసం హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బార్ అరాగ్చీ ప్రకటన చేశారు. మధ్యప్రాచ్యంలోని యుద్దానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలకు చెందిన నౌకలకు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించే లేదని ఇరాన్ తెలిపింది. ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో హర్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ నౌకలు సరుకులతో తమ గమ్యస్థానాలు చేరేందుకు మార్గం సులువైంది.

