తన అనుచరుడు గంగారెడ్డిని నడి రోడ్డుపై నరికి చంపితే కాంగ్రెస్ అధిష్టానం, సిఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని మాజీ మంత్రి, ఎంఎల్‌సి జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంతకాలం అవమానాలు బరించాలని జీవన్ రెడ్డి నిలదీశారు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం కానీ, పార్టీ కానీ తనకు అండగా లేదని తనకు గౌరవం కావాలన్నారు.తనకు పోరాటం కొత్త కాదు అని, రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. జగిత్యాలలో జరిగిన అభివృద్ధి కొడంగల్‌లో కూడా జరగలేదని ధ్వజమెత్తారు.

