అత్యాచారం కేసులో నిందితుడు , పంజాబ్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రాను పంజాబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్నెళ్లుగా అతను పరారీలో ఉన్నారు. గ్వాలియర్ వద్ద అతన్ని పట్టుకున్నారు. దీని కోసం పంజాబ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ పఠాన్ పేరుతో ఎమ్మెల్యే కోసం గాలించారు. దాదాపు ఏడు రాష్ట్రాల్లో బృందాలు అతని కోసం అన్వేషించాయి. ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసి తప్పించుకున్న ఎమ్మెల్యే పఠాన్మజ్రా కోసం పోలీసులు తెగ వెతికారు

