ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అమెరికాపై నిప్పులు చెరిగారు. అమెరికాను ఒక “టెర్రరిస్ట్ స్టేట్” (ఉగ్రవాద రాజ్యం) గా కిమ్ పేర్కొన్నారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం, సైనిక దాడులకు పాల్పడటం అమెరికా నైజమని ఆయన విమర్శించారు.”మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోము” అని కిమ్ కుండబద్దలు కొట్టారు. అణుశక్తి అనేది తమ దేశ భద్రతకు అవసరమని ఆయన స్పష్టం చేశారు.సియోల్ (Seoul) ను తమ దేశానికి ఉన్న నెంబర్ వన్ శత్రువు గా కిమ్ అభివర్ణించారు.

