మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఇవాళ జరిగిన పార్టీ శాసనసభాపక్ష భేటీలో అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు న్యాయం జరగడం లేదని, ఇదే విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యేలు తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యమిస్తున్నామని, అలాగే తమకు కూడా అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నామని జనసేన ఎమ్మెల్యేలు ఇవాళ పవన్ దృష్టికి తీసుకెళ్లారు.

