తెలంగాణ శాసనసభలో ఉద్యోగుల, రిటైర్డు ఉద్యోగుల సమస్యలపై అధికార ప్రతిపక్షం మధ్యపరస్పర ఆరోపణలతో సభను వేడిక్కించడమేకాదు బిఆర్ఎస్ వాకౌట్ చేయడానికి దారి తీసింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పిఆర్సి, డిఎ బకాయిలు రిటైర్డు మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. పెన్షన్ బెనిఫిట్ అందక వైద్యసేవలు పొందలేక సుమారు 30 మంది ఉద్యోగులు మృతి చెందారని హరీష్ రావు విమర్శించారు.

