గ్యాస్ కొరత కారణంగా తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీని నిలిపివేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు గత మూడేళ్ల నుంచి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడటంతో అధికారులు లడ్డూ తయారీని నిలిపివేశారు. అయితే, భక్తుల నుంచి డిమాండ్ రావడంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిపై లడ్డూలు తయారు చేయించాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అనుమతి రాగానే కట్టెల పొయ్యిలపై తయారు చేసి భక్తులకు పంపిణీ చేయనున్నారు.

