వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని గెలిపిస్తే.. వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 70 లక్షల మందికి రైతు భరోసా నిధులను రిలీజ్ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేశారు.

