మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కూల్చేందుకు సిద్దమవుతుండగా అపార్ట్మెంట్ వాసులు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అపార్ట్మెంట్లో ఉండే చిన్నారులు మా ఇండ్లు కూలగొట్టకండి అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డ్స్ రాశారు. సుమారు 1000కి పైగా పోస్టు కార్డులు రాసి నల్లటి రిబ్బన్ పై అతికించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు మాట్లాడుతూ.. తమ ఇల్లు కూలగొట్టి ఇక్కడ మరో భవనం నిర్మించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

