బంజారాహిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్ చల్ చేశారు. అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం రమేష్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఆనంద్ ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలోకి వచ్చి హంగామా సృష్టించారు.సీఎం రమేష్ ఉదయం పూట వివాదాస్పద స్థలం వద్దకు చేరుకుని ఇక్కడున్న వాళ్లను వీడియో తీయ్ అంటూ తన అనుచరులకు చెబుతుండటం. ఈ వివాదం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నట్టు తెలుస్తోంది.

