ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంత్రి లోకేశ్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం వద్ద వారికి టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఘనస్వాగతం పలికారు. శనివారం నాడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోనున్నారు.

