ఎల్పీజీ గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినే అవకాశం ఉందని, ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేలా రాష్ట్రంలో సమర్ధవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని సీఎం అధికారులకు సూచించారు. ఎక్కడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వకుండా చూడాలన్నారు. గ్రామీణ – గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలు, అన్న క్యాంటీన్లు, అంగన్వాడీలకు గ్యాస్ డెలివరీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తి స్థాయి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

