స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. లిటిల్ క్యూట్ ఫ్యాన్‌ను ఇంటికి పిలిపించి చిన్నారికి నచ్చిన భోజనం వడ్డించారు. ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడారు. లడ్డూలు, పులిహోర వడ్డించి మరీ ముద్దుల వర్షం కురిపించారు. ఆ తర్వాత పాపను ఎత్తుకుని సరదాగా కబుర్లు చెప్పారు. విజయ్ పాపను ఎత్తుకుంటే రష్మిక ముద్దాడారు. ఇంటికెళ్లి డ్రెస్ మార్చుకుని బజ్జుంటా అని చిన్నారి క్యూట్‌గా చెప్పడంతో నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

