ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పర్వదినాన విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 1.80 లక్షల ఖాళీలు ఉన్నాయని, కానీ ప్రభుత్వం కేవలం 10,060 పోస్టులనే భర్తీ చేస్తామనడం హాస్యాస్పదమని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారిని పచ్చిగా మోసం చేసిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

