ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ 13 ఏళ్ల కుమార్తె జూ యే యుద్ధ ట్యాంక్‌ను నడిపింది. ఫోటోలను ప్రభుత్వం మీడియా రిలీజ్ చేసింది. జూ యే ఆర్మీ ట్యాంక్‌ను డ్రైవ్ చేస్తుండగా.. ఆమె పక్కనే కిమ్ జాంగ్ కూర్చున్నారు. ఆ ట్యాంకర్‌పై మరికొంత మంది సైనిక అధికారులు కూడా ఉన్నారు. ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ ఆ ఫోటోలను రిలీజ్ చేసింది. ఆ అమ్మాయిని భవిష్యత్తు దేశాధినేతగా కిమ్ తీర్చిదిద్దుతున్నారేమో అన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

