తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుకల్లో అనంతిక సెంథిల్ కుమార్ అవార్డు గెలుచుకుంది. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, సినిమాల్లోని కళాత్మక విలువలను గుర్తించడంలో భాగంగా.. ‘8 వసంతాలు’ చిత్రంలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించిన యువ నటి అనంతిక సెంథిల్ కుమార్ కు ‘స్పెషల్ జ్యూరీ ఉత్తమ నటి’ అవార్డు లభించింది.అనంతికకు స్పెషల్ జ్యూరీ ఉత్తమ నటి అవార్డుతో పాటు గౌరవ సూచికగా వెండి జ్ఞాపికను అందజేశారు.

