పాన్ ఇండియా మూవీ ‘కేడీ: ది డెవిల్’ కోసం మంగ్లీ పాడిన ‘సర్కే చునార్ తేరి సర్కే’ అనే పాట సోషల్ మీడియాలో మంగ్లీని మరియు చిత్ర యూనిట్‌ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మంగ్లీ తన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేస్తూ క్షమాపణలు కోరారు. “ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. తెలియక చేసిన పొరపాటే తప్ప, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. దయచేసి క్షమించండి” అని ఆమె పేర్కొన్నారు.

