రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ పరిధిలోని పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డిఓపిటి) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం అధికారిక సమాచారం అందింది. తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు రామకృష్ణా రావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.

