స్కూల్ బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇబ్రహాంనగర్లో జరిగింది. సిద్దిపేటలో రావూస్ స్కూల్ బస్సు పలు గ్రామాలలో విద్యార్థులను పిక్ అప్ చేసుకొని స్కూల్కు వెళ్తోంది. ఇబ్రహీంనగర్ స్టేజీ వద్దకు రాగానే బస్సును వెనుక నుంచి సిమెంట్ లారీ ఢీకొట్టింది. బస్సులో ఉన్న పిల్లలు భయంతో కేకలు వేశారు. వెంటనే గ్రామస్థులు పిల్లలను బస్సులో నుంచి బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.

