కాశ్మీర్‌ను మంచు తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. రెండు రోజులుగా మంచు తుఫానుతోపాటు వర్షం కూడా జమ్ము కాశ్మీర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. మంగళవారం ఉదయం కాస్త తెరిపినిచ్చినా తర్వాత మంచు కురుస్తూనే ఉంది. దీంతో లోయలో జనజీవనం స్తంభించింది. చాలా చోట్ల 12 అంగుళాల మేర మంచు కురుస్తోంది. జోజిలా పాస్ ప్రాంతంలో 5 అంగుళాలు, సోనామార్గ్ ప్రాంతంలో 3-4 అంగుళాల మంచు కురుస్తోంది. ఇండియన్ ఆర్మీకి చెందిన 19 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి.

