గుంటూరులో ‘నవ్య శ్రీ వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ’ పేరుతో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి మరికొందరితో కలిసి ప్రారంబించి ఒక స్కీమ్ ప్రకటించాడు. లక్ష రూపాయలు ఇస్తే, వాటితో షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తామని నమ్మించాడు. ఆ లాభాల్లో నెలకు రూ. 10 వేలు చొప్పున 20 నెలల పాటు చెల్లిస్తామని ఆశ చూపాడు. భారీగా డిపాజిట్లు చేయించారు. ఇలా వందల మంది నుంచి కోట్లు వసూలు చేశారు.తీరా మార్చి 13వ తేదీన ఎవరికీ చెప్పకుండా నిర్వాహకులు ఆఫీసుకు తాళం వేసి పరారయ్యారు.

