కూకట్పల్లిలో పట్టపగలే కలకలం రేపిన దారి దోపిడీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. బండిమీద హవాలా డబ్బును తీసుకెళ్తున్న వారి కళ్లల్లో కారం చల్లి రూ. కోటి ఎత్తుకెళ్లిన వారిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.77.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

