రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలిపారు. బిఆర్ఎస్ మాదిరిగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్లలేదని అన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న బిఆర్ఎస్ ఢిల్లీకి ఎన్నిసార్లు చక్కర్లు కొట్టిందని, పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో ఎన్నిసార్లు ఢిల్లీకి తిరిగారో లెక్క తీయాలని శ్రీధర్ బాబు సూచించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తామని, ప్రభుత్వాన్ని ఆషామాషీగా కాదు.. బాధ్యతాయుతంగా నడుపుతున్నామని తెలియజేశారు.

