మర్రి ప్రశాంత్(35),శ్రావణి (33),కుమారుడు సహస్రన్ (10)తో కలిసి ఆదివారం మేడిపల్లిలోని చుట్టాల ఇంటికి వస్తుండగా స్పార్క్ హాస్పిటల్ దగ్గరలో వెనుక నుండి వచ్చిన కారు కియా సోనెట్ (టిఎస్08హెచ్ హెచ్ 6363) అదుపుతప్పి వీరు ప్రయాణిస్తున్న బైకును ఢీకొనడంతో మర్రి ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య శ్రావణి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది.వారి కుమారుడు ప్రమాదం నుండి బయటపడ్డాడు. కారు నడిపిన వ్యక్తి రామయ్యని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

