కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం, కేసరపల్లిలో జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో పలగాని ప్రణయ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు
కోల్పోయాడు. కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్, తన తమ్ముడు కౌశిక్‌ను ట్యూషన్ కోసం అవుటపల్లికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

