ఇరాన్ దేశానికి చెందిన అత్యంత కీలకమైన అణుకేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయి. అణుకేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా-ఇజ్రాయెల్ విమానాలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇస్ఫహాన్‌లోని వివిధ ప్రదేశాల్లో భారీ పేలుళ్లు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలాచోట్ల భారీ ఎత్తున నల్లపొగ ఆకాశాన్ని కమ్మేసింది. అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

